పుట:మధుర గీతికలు.pdf/531

ఈ పుట ఆమోదించబడ్డది

గానసభల పెక్కు నిర్వహణముచేసియు, చరిత్ర ప్రసిద్ధమైన జెండా కేసులో ఆయనతోబాటునిలిచియు తర్వాత పెద్దాపురం కాంగ్రెసు సంఘసమావేశంలో పిరువీకు జూపక లాఠీ ఛార్జికి గురియైన అసమాన సత్యాగ్రహయోధుడీ వీరాగ్రణియే!

సర్వశ్రీ చెళ్ళపిళ్ళ వెంకటకవి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, వడ్డాది సుబ్బరాయడు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, భావరాజు కృష్ణరావు, శ్రీపాద కామేశ్వరరావు. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మున్నంగి శర్మ, బాలదారి వీరనారాయణదేవు, దేవత శ్రీరామమూర్తి, వెల్లంకి కృష్ణమూర్తి, హరీంద్రనాధఛట్టోపాధ్యాయ, అజాడ ఆదిభట్ల నారాయణదాసు, చిలుకూరి నారాయణరావు, చిలుకూరి వీరభద్రరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఆచార్య రాయప్రోలు సుబ్బారావు, టంగుటూరి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, గిడుగు రామమూర్తి పంతులు, వైణికులు పొడుగు రామమూర్తి హేమచంద్ర సర్కారు మున్నగు ప్రముఖకవి పండిత, గాయక, నటశేఖరుల, సంఘసంస్కర్తల సమకాలీన గౌరవము పొందుటేకాక, ఆయా ఉద్యమములలో వారలకు సహకారమిచ్చి, ఆశ్రేణిలో మహోన్నతులకు కొంత ఆర్ధిక సాహాయ్యమందించి జీవితాం

vi