పుట:మధుర గీతికలు.pdf/530

ఈ పుట ఆమోదించబడ్డది

ఒకటననేల బాలభక్త సమాజము అనుగ్రంథాలయమునకు ముఖ్యప్రోత్సాహ మా సహృదయునిదే. అన్నగారైన నాళము రామలింగయ్యగారు ప్రతిష్ఠాపించిన వైశ్యసేవా సదనమును తొలుదొల్త నడిపించిన ఖ్యాతి వీరిదే.

శ్రీ పంతులుగారు స్థాపించిన పురమందిరమునకు, ప్రార్ధనాసంఘమునకు కార్యదర్శిగానుండి ఆ సంస్థలను ఉజ్జ్వలముగా నిర్వహించి శ్లాఘనీయమైన సామర్ధ్యము ప్రదర్శించిన యువసింహ మీ ధీరుడే.

ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ ప్రథమ శార్యదర్శి ఈ గ్రంథాల యారాధకుడే.

టౌను కాంగ్రెసు కార్యదర్శిగానుండి పూజ్య బాపూజీ సన్నిధిని తనభార్య సుశీలమ్మ విదేశవస్త్ర దహనముచేయుటకు ప్రోత్సాహ మొసగిన పరమదేశభక్తుడీ పోటుమానిసియే.

తన సతీమణి సుశీలమ్మ స్థాపించిన ఆంధ్రమహిళాగానసభకు ఆధారదండమై ఆద్యంతములు ఆ సంస్థను అభివృద్ధి పఱచిన గానకళోపాసి! శ్రీ దేవత శ్రీరామమూర్తి గారితో కలిసి

v