పుట:మధుర గీతికలు.pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv

జరిగింది. రోటరీ అధ్యక్ష కార్యదర్శులై న డా॥ కె. యస్‌, ఆర్‌. శర్మ, వి. జి. కె. మూర్తిగారలు, గ్రామ సర్పంచ్‌ శ్రీ యడ్లా రామయ్య, శ్రీ చందోలు అల్లా నారాయణ, శ్రీ చిటిప్రోలు కృష్ణమూర్తి, విడిదిని ఏర్పాటుచేసిన శ్రీ యక్కల పిచ్చయ్య ప్రభృతులతోపాటు ఈ వ్యాస రచయిత పాల్గొనటం, నాళంవారి చిత్రపటాన్ని బహూకరించటంజరిగింది.

వినుకొండ

8. 12. 1982 వ తేదీన వినుకొండ యువ సాహితీ వికాస వేదిక వారు జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన సభలో ప్రధానవక్తగా యీ వ్యాస రచయిత పాల్గొనటం జరిగింది. చతుర్విధ కవితాధురీణ శ్రీ బెల్లంకొండ సూర్యప్రకాశరావుగా రధ్యక్షతవహించిన సభలో యీ వ్యాన కర్త బహూకరించిన నాళం వారి చిత్రపటాన్ని నరసరావుపేట లైబ్రేరి యన్‌, రచయితయైన శ్రీ ముప్పాళ్ళ మధుసూదనరావుగారు , అవిష్కరిం చటం జరిగింది. ముఖ్య అతిధిగా శ్రీమతి లక్ష్మికాంతమ్మగారు పాల్గొ న్నారు. అభ్యుదయ కవులలో ప్రముఖలైన శ్రీ గంగినేని వేంకటేశ్వర రావు, శ్రీయుతులు కమలారామ్‌, చందోలు చంద్రశేఖర్‌, యోగీశ్వర రావు, ప్రిన్సిపాల్‌ శ్రీ పిచ్చయ్యగారు, తెలుగు సాహిత్య ప్రియుడైన తమిళ సోదరుడు షణ్ముగం ప్రభృతులు సభాకార్యక్రమాలలో పాలు పంచుకొన్నారు.

బందరు

బందరు జాతీయ భోధనా కళాశాల సాహిత్య సమితివారు 10 - 12 - 1982 వ తేదీన ఏర్పాటు చేసిన సభలో యీ వ్యాన రచయిత ప్రధాన వక్తగా పాల్గొనటం జరిగింది. సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు