పుట:మధుర గీతికలు.pdf/529

ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరాంతమున, ఆ స్త్రీలకు పరీక్షలు పెట్టి, విజేతలను బహూకరించి స్త్రీ విద్యను ప్రోత్సహించిన స్త్రీ విద్యాభిమాని!

శ్రీ వీరేశలింగముగారి అన్ని ఉద్యమములయందును వారికి కుడిభుజము గా నిలిచి, తన శక్తియుక్తులను, సంపదను సంస్కారోద్యమము నందు వెచ్చ పెట్టుటే కాక, అత్యంత ధైర్య సాహసములు ప్రదర్శించి అనాటి మూఢవిశ్వాసముల రోజులలో, ఎన్నో కష్టముల నెదుర్కొని, పంతులుగారికంటె ముందు జందెముతీసివేసి సర్వమతసహపంక్తిభోజనములను తనయింట నిర్వహించి, బ్రహ్మసమాజసంస్కారమునకును, వితంతువివాహసంస్కారోద్యమమునకును తనువు నంకితము చేసిన ధైర్యశాలి:

గౌతమీ గ్రంథాలయమునకు ప్రతిష్ఠాపకుడేకాక, జీవితాంతము అధ్యక్షుడు ఆ మహావ్యక్తియే.

శ్రీ పంతులుగారి సత్ప్రతిష్ఠాపనమైన హికకారిణీ సమాజమునకు పంతులుగారి తర్వాత ఆజీవితాధ్యక్షుడును కృష్ణరావుగారే.

అట్లే గౌతమీ గోసంరక్షణ సంఘమునకును జీవితాంత మధ్యక్షుడా మాననీయుడే.

iv