పుట:మధుర గీతికలు.pdf/528

ఈ పుట ఆమోదించబడ్డది

జాతీయములు, లోకోక్తులు, న్యాయములు తెలుగు భాషాసరస్వతి సామెత లైన పదివేల తెలుగు సామెతలను ప్రబంధోదాహరణములతో సేకరించిన, భాషాపరిశోధకుడు!

అన్ని రంగములయందును అతిశయ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించి భరతదేశానికే ఖ్యాతిదెచ్చిన, ఆంధ్రుల అత్యున్నత సంస్కృతికి దర్పణము పట్టినట్టి, 5, 6 వందల మకుటములలో 2, 3 వందల గ్రంథములనుండి ఏర్చి కూర్చిన ఉదాహరణములతో, ఆంధ్ర సరస్వతికలంకారముగా గైసేసిన ముత్యాల హారమువంటి సాహిత్యవిజ్ఞాన సర్వస్వమునకు తొలిసంకలన కర్తయైన అఖండధీశాలి !

భవిష్యత్పౌరులగు బాలల అభివృద్ధి కై గోరుముద్దలు, మీగడతఱకలు, తేనెచినుకులు, పాలతరగలు, వెన్న బుడగలు, వెన్నెల వెలుగులు, దీపావళి, విరిదండ అను శీర్షికలతో "మధురగీతికలు” అను మకుటమునను, ఇతర కావ్యములను ప్రచురించిన ప్రప్రధమ బాల వాఙ్మయస్రష్ట !

గౌతమీ గ్రంథాలయమునుండి ఉత్తమ గ్రంథములను గృహిణుల సౌకర్యార్థము, వారివారి యిండ్ల కు పంపి,

iii