పుట:మధుర గీతికలు.pdf/527

ఈ పుట ఆమోదించబడ్డది

మిత్రులకు కూడా పద్యాలలోనే వ్రాసే అలవోకగా ఉత్తరాలు వ్రాసే అలవాటు కల్గిన అమలమనీషి!

తనకు ఇరువదేండ్ల ప్రాయము వచ్చీరాని వయస్సు నందే సోదరదేశీయులలో విజ్ఞానదీప్తి పెంపొందింపజేయడానికి గ్రంథాలయం స్థాపించి, ఆగ్రంథాలయాన్ని గౌతమీ గ్రంథాలయం అనే పేరున, ఆంధ్ర దేశమందలి సర్వోన్నత గ్రంథాలయంగా తీర్చి దిద్దడమేకాదు,


గ్రంధనిలయంబుగల నరకమందు
నైన నివసింప గాక్షింతు గాని
గ్రంధ నిలయంబు లేని స్వర్గంబు నందు
నిముస మేనియు నివసింప నిచ్చగింప

అని కంఠోక్తిగా చాటిచెప్పిన గ్రంథాలయారాధకుడు!

మానవసేవ అనే తొలి తెలుగు సచిత్ర మాసపత్రికను ప్రచురించిన పత్రికోద్యమాభిమాని! శ్రీ చాగంటి వీరభద్రకవి, శ్రీ సత్యవోలు అప్పారావు మున్నగు ఎనమండుగురు కవులతో కొలువుదీరి 'అభినవ కృష్ణదేవరాయ'డై, చదువుల తల్లిని, తలపుగద్దె పై అధివసింపజేసి అర్చించిన సారస్వత పోషకుడు!

ii