పుట:మధుర గీతికలు.pdf/526

ఈ పుట ఆమోదించబడ్డది

మధురకవి ప్రశంస

పుడమితల్లి పురుటినొప్పులు పడే పుణ్యసమయాలలో, విక్రమనామ సంవత్సర పుష్యమాసంలో మాన్యులు, శ్రీ మధుర కవి నాళము కృష్ణరావుగారు, సుప్రసిద్ధ నౌకావ్యాపారదక్షుడు, మహావితరణశీలి అయిన శ్రీ నాళము కామరాజుగారి కడగొట్టు కుమారుని గా జన్మ గై కొన్నారు.

నాళము కామరాజుగారు మద్రాసునుండి, కలకత్తా వఱకు, బాటలే లేని ఆకాలంలో, బాటసారుల వసతి సౌకర్యార్థం, ఆరు సత్రాలు నిర్మించిన మహావ్య క్తి, గౌతమీక్షేత్ర మాహాత్మ్యాది గ్రంథాలను ముద్రణచేయించి, ప్రచురించిన ధీశాలి ! కావ్యస్వీకారము గావించిన రసపిపాసి ! ఆమహానుభావుని గారాబుపట్టియైన కృష్ణారావుగారు అనేక విషయాలలో తండ్రిగారి కీర్తిని, తన ఉజ్జ్వల సేవాకార్య క్రమాలతో, అతిశయింప జేసిన, సార్ధక పుత్రుడు:

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు చిన్న వయస్సులోనే, IV th ఫారం పరీక్షాపత్రానికి పద్యాలలో సమాధానాలిచ్చిన ప్రతిభాశాలి: కృష్ణరావుగారు!