పుట:మధుర గీతికలు.pdf/52

ఈ పుట ఆమోదించబడ్డది

iii

గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ యన్నం వేంకటనరిసిరెడ్డి, శ్రీ యన్. మాలకొండయ్య, కథారచయిత లింగంగుంట జానకిరాం ప్రభృతులు కార్య క్రమంలో, నిర్వహణంలో పాల్గొన్నారు.

ఈ సభను తిలకించిన అనేక దురంధరులు, గుంటూరు జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ మేళ్ళచెరువు వీరాంజనేయులు నాళంవారి సంక్షిప్త వ్యక్తిత్వాన్ని చిత్రపటంతోసహా కరపత్రాలుగా ముద్రించి, ఆయా సంఘాలకు పంపటం జరిగింది. ఆ కృషిలో వారి కోరిక మేరకు యీ వ్యాసకర్త సహకరించటం జగింది.

కారెంపూడి

పలనాటి కురుక్షేత్రంగా పరిగణింపబడే కార్యంపూడిలో 1981 మే 31వ తేదీన రోటరీ క్లబ్ వారు జిల్లా పరిష దున్నత పాఠశా లలో శతజయంతి సభను ఘనంగా నిర్వహించారు.

"అలనాడు కృష్ణుడు తన మురళీ నాళంతో ప్రజలకు పరవశింప చేశాడు. అయితే యీనాటి నాళం వారి విషయంలో మురళి స్థానంలో కలం ప్రవేశించిందని, తత్ఫలితంగా సంగీత స్వభావమైన మాధుర్యాన్ని అది సంకరించుకుం"దని అంధ్ర విశ్వవిద్యాలయంలో తుమ్మలవారి సాహిత్యా న్ని గూర్చి పరిశోధనచేస్తున్న చిట్టి ప్రోలు వేంకటరత్నంగారు పేర్కొన్నారు

ముఖ్యఅతిధి లక్ష్మీకాంతమ్మగారిని తదితరులను సభాస్థలికి మేళ తాళాలతో, స్వాగత సత్కారాలతో విడిదినుండి తీసికొనిరావటం జరిగింది. లక్ష్మీకాంతమ్మగారికి సన్మానపత్రాన్ని సమర్పించిన తరువాత చీతిరాల భారతీ శివకోటేశ్వరరావు దంపతులు నూతన వస్త్రాలను బహూకరించటం