పుట:మధుర గీతికలు.pdf/519

ఈ పుట ఆమోదించబడ్డది



తనదుసౌభాగ్య మంతయు నినున కొసఁగి
ఇవము మైనిండఁ గురియంగ నెఱ్ఱవాణి
ఊర్పుచే మాఁగువాఱిన దర్పణ మన,
హిమకరుం డొప్పె తేజోవిహీనుఁడగుచు.

మంచు పడుటను, తపనుండు మందుఁ డగుట,
సరసులందలి నీరెల్ల చల్ల నగుచు
సురుచిరం బయి మధురమై శుద్ధ మయ్యు
పానయోగ్యము గాదయ్యె పాంథతతికి.

విరియఁబాఱిన చెంగల్వవిరులమీఁద
వ్రాలి తూఁగాడు మధుకరజాల మొప్పె,
తుంటవిలుతుని హోమపుమంటపై ని
బుగులు బుగులున నెగసెడుపొగలొ యనఁగ.

చేగదేఱిన బారెడు చెఱకువింట
నల్ల గలువ లకోరి సంధిల్లఁ జేసి
భ్రమరఝుంకార టంకృతుల్ పఱఁగ మరుఁడు
విరహి జనముల పైఁ బడి వేఁటలాడె.

68