పుట:మధుర గీతికలు.pdf/518

ఈ పుట ఆమోదించబడ్డది


సహజభావంబుచేతనే చల్ల నగుచు
వీచు నుత్తరవాయువు ద్విగుణ మైన
శీతలంబున నిపుడు ప్రభాతమందు
విసరుచున్నది నీహారవిద్ధ మగుచు.

గుట్టపై నొప్పు పచ్చికకొనలఁ గదురు
మంచుబిందులు తళతళ మంచు మెఱసె,
పుడమిచేడియ బొమిడికమున తురాయి
కుచ్చుపై గ్రుచ్చు మణులట్లుకొమరు మివిలి.

పొడుపుగుబ్బలిమీఁదను పొడుచు టాది
చలికి గజగజ వడకుచు చండకరుఁడు
గురువువాఱుచు బిరబిర పరువు లెత్తి
చరమభూధరగుహలందు మఱుఁగుజొచ్చె.
.
తుహినకణములఁగిరణముల్ దోఁగియుంట,
కరము దవ్వున నుదయంబు గాంచియుంట,
వేడియెల్లను దిగఁద్రావి పోడిమి చెడి
శీతకరుఁ డయ్యె సీతున శితకరుండు.

67