పుట:మధుర గీతికలు.pdf/516

ఈ పుట ఆమోదించబడ్డది



పసులమందలు పొలముల మసలియాడె
క్రేళ్ళువాఱుచు గుప్పించె లేళ్ళగుంపు
జలవిహంగమ కలకలంబులు సెలంగె
నట్టుపిట్టల యాటలు కట్టువడియె.

బంతి విరివిగఁ బూఁచె, చేమంతి విరిసె,
ఉసిరిక లెసంగె, లొద్దుగు లెసక మెసఁగె,
రేఁగు చెలఱేఁగె, నిమ్మలు సోగదేఱె,
పొంకమున ప్రేంకణంబులు బింకమెక్కె.

వంగ చిక్కుడు గుమ్మడిపాదు లలరె
చెఱకు మిరెముల చేనులు చెంగలించె
వెలగ నారింజపండులు విస్తరించె
కూరగాయలు కుప్పనఁగూర లయ్యె.

నల్ల గల్వలు చెంగల్వ లుల్ల సిల్ల
క్రౌంచములు సారసంబులు సంచరింప,
కలఁకదేఱిన చల్ల నిజలము గలిగి
సరసు లొప్పారె కన్నులకఱవు దీఱ.

65