పుట:మధుర గీతికలు.pdf/512

ఈ పుట ఆమోదించబడ్డది


సతతవర్షాంబుధారాభిహతులచేత
కలఁగి తారలు నింగిని నిలువలేక
కుప్పతిప్పలుగా నేలఁ గూలె ననఁగ,
గుప్పుగుప్పున వడగండ్ల గుండ్లు రాలె.

ఏటిదరి బారులై యున్న తాటిచెట్లు
కొసరి యొండొంటి డిక్కీలు కొట్టుకొనియె;
చింతకొమ్మలఁ గూర్చుండి జెముడుకాకు
లల్ల నల్లన ఱెక్కల నార్చుచుండె.

ఇఱుకుసందుల వెంబడి మెఱకనుండి
వఱ్ఱులొడ్డుచు ప్రవహించె వాననీరు,
తల్లి దరినుండి అల్లరిపిల్ల వాఁడు
కేరి గంతులువై చుచు పాఱినట్లు.

నిండిపోయిన చెఱువులనుండి పొంగి
పొలములోనికి పొరలిన జలముతోడ
కొట్టుకొనివచ్చు చేఁపలఁ బట్టుకొనఁగ
సంభ్రమంబున మూఁగిరి జనము లెల్ల.

61