పుట:మధుర గీతికలు.pdf/511

ఈ పుట ఆమోదించబడ్డది


ముంపుగొను కారువానల ముసురుచేత
చలిని వడఁకుచు ధారుణీలలన మేన
కప్పుకొనినట్టి పచ్చని కంబళి యన,
పసరుపచ్చికజొంపముల్ మిసిమిదేఱె

ముమ్మరపువానఁ దన పువ్వుటమ్ము లెల్ల
వమ్ములై చన, విరహిగ్రీవములఁ గోయ
మరుఁడు గైకొన్న పై డిరంపంబొ యనఁగ,
పొలుపుమీఱెను గేదంగిపువ్వు ఱేకు.

దారుణం బగు వర్షాంబుధారచేత
సారహీనము లైన యబ్జముల వీడి
తుమ్మెదలు వ్రాలె గంధబంధురము లైన
వికసితకదంబపుష్పగుచ్ఛకము పైని.

క్రమ్ముకొనియున్న కారు మేఘములచేత
కాల మెల్లను నొకతీరే కానఁబడఁగ,
ప్ర్రకటజలజాతమాలతీ వికసనములు
జనుల కిది పగ, లిది రేయి యనుచుఁ దెలిపె.

60