పుట:మధుర గీతికలు.pdf/510

ఈ పుట ఆమోదించబడ్డది


మత్తభృంగములకు తేనె రిత్త యయ్యె
గండుకోయిలకూఁతలు కట్టువడియె
పంకజాతకులంబుల పొంక మడఁగె
కాకిమూఁకలరొదలు చీకాకు గొలిపె .

వెల్లువలు తటాకంబులు వెల్లి విరిసె
ఇవురఁబాఱిన మ్రాఁకులు చివురుతొడిగె
పసరుపచ్చికగుబురులు మిసిమిదేఱె .
పాదరక్షలు గొడుగులు ప్రబలమయ్యె.

మంకెనలు పూఁచె, మాలతి బింకమెక్కె,
కడిమిపువ్వులగుత్తులు కడిమి సూపె,
మొల్ల లును కొండమల్లెలు నుల్లసిల్లె,
కన్నె గేదంగిఱేకులు చెన్నుమిగిలె.

పెక్కువన్నెలకాంతుల విరులు గ్రాలు
నీలిగోరంట మొక్కలచాలు దనరె,
విడువ కెప్పుడు దివి నుండ విసుఁగుజెంది
వసుధ విహరించు నింద్రచాపంబొ యనఁగ.

56