పుట:మధుర గీతికలు.pdf/51

ఈ పుట ఆమోదించబడ్డది

ii

టం జరిగిందని తమ పితృపాదులను గూర్చి శ్రీమతి లక్ష్మీకాంతమ్మగారు పేర్కొనటం జరిగింది.

మహాసభ పక్షాన అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులైన శ్రీయుతులు కాసం రాధాకృష్ణయ్య శ్రేష్ఠి, జూటూరు వేమయ్య, కబలవాయి రాధాకృష్ణమూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. ఈ వ్యాసకర్త నాళం వారి చిత్రపటాన్ని బహూకరించటం, భావకవిగా నాళంవారు అనే అంశాన్ని పరామర్శించటం జరిగింది.


నరసరావు పేట

10 - 3 - 1981 వ తేదీన వరసరావుపేట అభ్యుదయభారతి సాహిత్యసమితివారు ఏర్పాటు చేసిన శత జయంతి సభలో శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, డాక్టర్ అకురాతి పున్నారావు, శ్రీ చిటిప్రోలు కృష్ణమూర్తి ప్రభృతులు నాళంవారి జీవితాన్ని, సాహిత్యాన్ని భిన్నకోణాల నుంచి పరిశీలించారు.

తిరుపతి వేంకటకవుల తరువాత అటు దువ్వూరివారు, ఇటు నాళం వారు మాత్రమే తెలుగులో సారళ్యాన్ని సంతరించి పెట్టిన సాహిత్య కారులని కైకేయి తరంగిణీ ఇత్యాది గ్రంథకర్తలైన చిటిప్రోలు కృష్ణమూర్తిగారు పేర్కొనటం జరిగింది. ఈ వ్యాపకర్త సమర్పించిన నాళం వారి చిత్రపటాన్ని పంచాయతీరాజ్యం, విశ్వశిల్పి పత్రికా సంపాదకులు, గ్రంథాలయోద్యము. కార్యకర్తలలో ఒకరైన చిఱ్ఱాపూరు నాగభూషణాచార్యులుగారు ఆవిష్కరించారు.


అభ్యుదయ భారతి తరపున దాని అధ్యక్ష కార్యదర్శులైన శ్రీయుతులు కొప్పరపు సత్యనారాయణ, ముప్పాళ్ల మధుసూదనరావు, జిల్లా