పుట:మధుర గీతికలు.pdf/509

ఈ పుట ఆమోదించబడ్డది



మెడలు సారించీ తొండలు మిన్ను జూచే
దుమ్ము మైనిండ పిచ్చుకల్ జిమ్ముకొనియె
బురదలో నూరపందులు పొరలియాడె
దున్న పోతులు తిరుగాడె దుండగమున.

మేఁత సాలించి యావు లంబే యటంచు
మరలి యింటికిఁ జునుచుండె మందగొనుచు,
పొదుఁగుదూఁటులు వదలి క్రేపులుతొలంగి
మొదవుకదుపులమాటున నొదిఁగియుండె.

ఒండుపిఱుఁదను వేఱొండు పిండుగట్టి
నీడలను జేరి మేకలు నెమరువెట్టె;
కొట్టకొనకొమ్మ డిగి క్రిందకొమ్మ మీఁద
నిలిచి పులుఁగులు కిలకిల యెలుఁగులిడియె.

నీలజీమూతపటలంబు నింగినుండి
ఇంద్రచాపంబుతోఁ గూడి యిలకు డిగ్గి
స్వేచ్ఛ మీఱ విహారంబు చేసె ననఁగ,
నెమలి పురివిచ్చి నృత్యంబు నెఱపుచుండె.

57