పుట:మధుర గీతికలు.pdf/507

ఈ పుట ఆమోదించబడ్డది

వర్ష ఋతువు



దీప ముడివోవఁజీఁకటి, కోప ముడుగ
నిర్మలం బగు శాంతంబు నెలకొసుగతి.
భీష్మతర మగు గ్రీష్మంబు వెడలినంత
వర్షకాలంబు చల్లనై హర్ష మొదవె.

ప్రాచిదిక్కున వాయువుల్ వీచియాడె
ఉత్తరంబున ప్రతిసూర్యుఁ డుదయమొందె
పశ్చిమంబున నింద్రచాపంబు తోఁచె
దక్షిణంబున మేఘసంతతులు గూడె.

ధగధ గంచును మెఱుఁగులు తాండవించె
'పెళ పెళంచును నుఱుములు ఫెటిలి యుఱిమె
పేటపె టంచును బెడిదంపుపిడుగు లడరె
గుప్పుగుప్పున వడగండ్ల. గుంపు రాలె.

56