పుట:మధుర గీతికలు.pdf/506

ఈ పుట ఆమోదించబడ్డది



తరణిబింబపురాట్నాన,కీరణము లను
సన్ననూలును, వడికి, గ్రీష్మంబు పేరి
సాలే నేసిన జిలుఁగువస్త్రంబు లనఁగ.
ఎండమావులు కన్పట్టె నిండుజిగిని.

తలఁపు తలఁచినమాత్ర డెందంబు కందు,
మోవి కదలింప నో రెల్ల పొక్కిపోవు,.
కనులు పై కొత్త ఱెప్పలు కమరు; నౌర!
నిండు వేసఁగియెండ వర్ణింపఁ దరమే!

పాలకడలిని వెన్నుండు పవ్వడించె,
మంచుకొండను నివసించి మనియె హరుఁడు.
తమ్మిగద్దియపై నెక్కి బమ్మ యుండె,
నందనంబున విహరించె నాకవిభుఁడు

మెండుగాఁ గాయు వేసంగియెండ సెగకు
బీతుచే తల్లడిల్లి తబ్బిబ్బు వొంది :
వేల్పు పెద్దలె యీరీతి వెగడు గుడువు, ..
పుడమిజనముల గొడవలు తడవ నేల?

55