పుట:మధుర గీతికలు.pdf/502

ఈ పుట ఆమోదించబడ్డది

గ్రీష్మ ఋతువు



దివస మంతకు నంతకు దీర్ఘ మయ్యె,
సవితృఁ డు త్తరదిక్కున సంచరించే,
నాఁటినాఁటికి నెండలు గాట మయ్యె,
వేడిగాడ్పులు....మెండుగ విసరఁజొచ్చె.

ఏళ్ళు కొలఁకులు యిఱ్ఱింకు లింకె,
కీలజాలము వనములఁ గేళి సలిపె,
గగనతలమున సుడిగాలి కెగసె ధూళి,
ఎండమావులు దండిగ మెండుకొనియె.

వేడియెండల మలమల మాడి మాడి
పాముపడగలక్రింద కప్పలు వసింప,
నెమలిపింఛంబుగొడుగలనీడఁ జేరి
పడగలను వాల్చి పన్నుండె పన్నగములు.

51