పుట:మధుర గీతికలు.pdf/50

ఈ పుట ఆమోదించబడ్డది
అనుబంధం - I

నాళం వారి శత జయంతి సభలు - వాని విశేషాలు


మధురకవి నాళం కృష్ణరాయని శతజయంతి సభను 30 - 8 - 1981 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభవారు కాచిగూడలోని వైశ్యాహాష్టలుతో నిర్వహించారు. ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు సభాధ్యక్షత వహించారు. "నాళం వారి శతజయంతి ఉత్సవం వైశ్యులు మాత్రమేకాక తెలుగువా రందరు జరుపుకో దగిన ఉత్సవం అన్నారు. శ్రీకృష్ణరాయాంధ్ర సాహిత్య విజ్ఞానసర్వస్వం వంటి గ్రంథాన్ని తయారు చేసిన పూర్వకవి యెవరూ తనకు తెలిసినంతవరకు కన్పించలేదన్నారు.


కళాప్రపూర్ణ శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, శ్రీమతి కోడూరి లీలావతి, శ్రీయుతులు నీలా జంగయ్య, పి. లక్ష్మీకాంతం శ్రేష్ఠి, చిటిప్రోలు కృష్ణమూర్తి ప్రభృతులు ప్రపంగించడం జరిగింది. "నాళం వారిని గూర్చి కవిలోకం, పండితలోకం అర్దం చేసికోవలసినంతగా అర్థం చేసికో లేదని, తెలుగు కొరకు, తెలుగు భాషకొరకు కష్టపడి తెలుగు దనం సాధించటానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయ"మని ఆ వక్తలు అభిప్రాయపడ్డారు.


బ్రాహ్మ సమాజ చరిత్రలో పేర్కొనదగ్గ ముగ్గురు నలుగురు ప్రముఖ వ్యక్తులలో వీరొకరని, లక్షలాదిగా తమ ఆస్తిని సాహిత్యం కోసం, సమాజం కోసం హెచ్చించిన మనీషి కృష్ణరావుగారు తమ చివరి ఘడియల్లో డాక్టరు ఫీజుకు కూడా డబ్బులు ఇవ్వలేని స్థితికి వచ్చారని, శిస్తు కట్టలేని కారణాన షుమారు 500 ఎకరాలను ప్రభుత్వంవారు తీసికోవ