పుట:మధుర గీతికలు.pdf/492

ఈ పుట ఆమోదించబడ్డది


'కాను లెన్నేని యిచ్చెదఁ గాని, ముందు
కన్నెరో, చెప్పు మేది నీ యున్నయూరు?'
'తిరుప మెత్తుచు నూరూరఁ దిరుగుదాని
కూరు పేరేటి కయ్య? - మైసూరు నాది,'
-
'వెలఁదిరో, నిన్ను తద్దయు వేఁడువాఁడ
చిన్న మాట వచింపుమా, ఎన్నఁడైన
సుందరాంగిని నళిని చూచినావె?'
'చచ్చి యెన్నఁడొ స్వర్గంబు జొచ్చెనయ్య'

‘అకట ! నళిని గతించెనా? అట్టు లైన,
రమణిరో, నీకు నాదు సర్వస్వ మెల్ల
నప్పన మొనర్తుఁ, గైకొను, మాపె లేని
నావిభవ మేల, ఇంక నాజీవ మేల.”

'వలదు, తాళుము - నీదు సర్వస్వ మెల్ల
ఎవతెకొఱకయి త్యజియింప నెంచినావొ,
అమ్మహాభాభాగ్యరాశి జీవమ్ములోడ
నిలిచియున్నది సుమ్మిదే నీదుచెంత.'

41