పుట:మధుర గీతికలు.pdf/490

ఈ పుట ఆమోదించబడ్డది

నళిని-నందుఁడు


మహిషపురమునఁ గలఁ డొక మంత్రివరుఁడు,
నందుఁ డాతని కూరిమినందనుండు;
పుడమియేలికకూఁతురు పువ్వుఁబోడి
నళిని యాతని హృదయంబు నాఁచికొనియె.

అతని యకలంక మగు ప్రేమ యందరాని
మ్రానిఫల మని భావించి, వానితండ్రి
పంపివై చెను నందుని పరిసరంపు
పట్ణణంబున కెద్దియో వ్యాజమునను.

జరిగే మూఁడేఁడు, లొకనాఁటి సంజవేళ,
నందుఁ డీరితిఁ దలపోసె డెందమండు:
‘పడఁతి నేను తలంచని గడియ లేదు,
తలఁచునే యాపె న న్నొక్కతడవయైన'

39