పుట:మధుర గీతికలు.pdf/489

ఈ పుట ఆమోదించబడ్డది


నిలువుటద్దముచెంగట నిలిచి, నీదు
సొబగు దిలకించుచున్నావొ చోద్యమొప్ప?
సరసమాడుచు నున్నావొ సఖుని గూడి?
ఏమిచేయుచు నున్నావొ యెవ్వఁ డెఱుఁగు?

ఈఁగ యారీతి గూట గం తిడిన యంత,
ఒక్క పెట్టున దానిపై కుఱికి, తనదు
కాళ్ళతోఁ బట్టి యటిట్టు కదలనీక
గుటుకు మని దాని సాలీఁడు గుటకవైచె.

38