పుట:మధుర గీతికలు.pdf/481

ఈ పుట ఆమోదించబడ్డది


వగవ నేటికి వచ్చినవారిఁ గూర్చి?
కొడుకు లై నను మీరలే, కూఁతు లైన
మీరలే గాని యన్యు లెవ్వారు లేరు,
కావరే నన్ను మన్నించి గరితలార?"

అనుచు నాతఁడు వాపోయి, యంతనుండి
వారి నిరువుర ధయతోడ గారవించె;
తనదునాధుఁడు నందుఁడే యని తలంచి
అన్యు నెవ్వని వరియింపదయ్యె కుంద.

30