పుట:మధుర గీతికలు.pdf/480

ఈ పుట ఆమోదించబడ్డది


పతిని బాసిన పరమనిర్భాగ్యురాల,
నేను బ్రతికిన చచ్చిన నేమిలెక్క?
దిక్కుమాలిన యట్టి యీ దీనురాలి
కుందఁ గైకొని కావుము కూర్మి గదుర."

అంచు నీరీతి పున్న వచించుచుండ,
ఉస్సురుసు రని వేడినిట్టూర్పు పుచ్చి
నేలవ్రాయుచు మిన్నక నిలిచియుండె
కుంద, శోకంబు రూపంబు నొందె ననఁగ.

ఆమెపలుకులు ములుకులై యాత్మ నాఁట
వృద్ధుఁ డంతట విలపించె వెక్కి వెక్కి,
“అక్కటా నాదుచిన్నారియనుఁగుసుతుని
చేతులారఁగఁ జంపిన ఘాతుకుండ.

తాను మనసార వలచిన తరుణిఁ గూడి
సుతుఁడు సుఖముండ, చల్లగాఁ జూడలేక
కోతవెట్టినయట్టి కర్కోటకుఁడను;
అకట! నావంటి పాతకి యవనిఁ గలఁడె?

29