పుట:మధుర గీతికలు.pdf/479

ఈ పుట ఆమోదించబడ్డది



'జనకునానతి పాలింపఁజాల నైతి,
నంచు నీసుతుఁ డెపుడు చింతించుచుండె;
అంత్యకాలము దాపింప, నతఁడు సారె
నాన్న నాన్నాయటంచు ప్రాణములు విడిచె.

పావనంబైన నీదుగర్భమునఁ బుట్టి
అంతిమంబున నీసుతుడుఁ డనుభవించి
నట్టి దైన్యము వర్ణింప నలవి యగునె?
వాని నన్నిటి నిట తడవంగ నేల?

వినుము నావిన్నపం బిదె విన్న వింతు-
‘అనుఁగుకోడల, నీకృప కర్హురాల'
అనుచు నిను వేఁడ, వేఁడెద తనయు నాకు
కూర్మి దయచేసి, కుందఁ గైకొను మటంచు.

నీదుతనయుండు చేసిన నేరమునకు
నన్ను దండింప నగుఁ గాని, యెన్నడేని
ఎట్టి నేరంబు గావించి యెఱుఁగనట్టి
ముగుద కుందను శిక్షింపఁ దగునె నీకు?

28