పుట:మధుర గీతికలు.pdf/478

ఈ పుట ఆమోదించబడ్డది


పాన్పుమీఁదను వృద్ధుండు పవ్వళించి
గట్టిగా బాలు నక్కునఁ గదియఁజేసి
వానిబుగ్గల జిగిముద్దు వర్షములను
ఒక్క పెట్టునఁ గురిపించుచుండెఁ జెలఁగి.

గల్లుగల్గున చిఱుగజ్జె లల్ల లాడ
ఱొమ్ముమీఁద దువాళించి, హుమ్మటంచు
బలిమిమై తాతగడ్డంబు పట్టి పీఁకు
చుండె బుడుతఁడు-వాఁడెంతదుండగీఁడొః

సందిదే యని వారలు సంభ్రమమునఁ
జనిరి లోనికి; బాలుండు జననిఁ జూచి
'అమ్మె' యని చిట్టిచేతుల నట్టె చాఁచి
దిగ్గు రని పాన్పు నుండి డిగ్గనుఱికె.

మామపదములపైఁ దనమౌళి సోఁక,
వున్న యిట్లనె, “నీసుసుఁ డున్నయపుడు
ప్రేమమైనిన్ను నోరార ‘మామ' యనుచు
పిలుచు భాగ్యము నాకు లభింపదయ్యె

23