పుట:మధుర గీతికలు.pdf/477

ఈ పుట ఆమోదించబడ్డది


"ఏమిచిత్రమొ? అక్కరో: మామ నీదు
తనయుఁగై కొనె, వెడలి పొమ్మనుచు నన్ను
నెట్టె నవలికి, నామాట యెట్టు లైన
నేమి బాలుండు సుఖముండె, నింతె చాలు-

"చెల్లె! నీ విట్టు లాడంగఁ జెల్లు నొక్కొ?
ఈవు నాకయి వెతజెంద నేటి కమ్మ?
వానికడ కేగి వేఁడెద, బాలు నాకు
నిమ్మటంచును, మగుడ నిన్ గొమ్మటంచు.

వృద్ధుఁ డొకవేళ నాదగు వేఁడికోలు
కియ్యకొనఁడేని, చెల్లెలా! యీవు నేను
ఒక్క చోటనే వసియించి యుంద మమ్మ
అరమరలు లేక బ్రతికియున్నన్ని నాళ్ళు.”

అంచు నీరీతి వున్న వచించె; తోనే
వార లిరువురు పయనమై వానియింటి
కేగి నిలిచిరి ద్వారంబునెట్టయెదుట;
అంతఁ గనుపట్టె లో నొక్కయద్భుతంబు.

26