పుట:మధుర గీతికలు.pdf/475

ఈ పుట ఆమోదించబడ్డది


కుంద యీరీతి వచియింప, క్రుద్ధుఁ డగుచు
పలికె వృద్ధుఁడు పటపట పండ్లు కొఱికి;
"సిగ్గు లేదటే? మును నీకు చెప్పలేదె
వానితో నెట్టిజోక్యము వల దటంచు.”

గోలుగోలున నేడ్చుచు కుంద యిట్టు
చేప్పె, “న న్నేమి చేసిన చేయు మయ్య,
అన్నెమును పున్నె మెఱుఁగని యట్టి చిన్ని
బాలుఁ గైకొను, మద్దియే చాలు నాకు.”

అనుడు, వృద్ధుఁడువచియించె నాగ్రహమున
“ఔ నెఱుంగుదు, నిది యెల్ల నాగయాళి
జంతయును నీవు పన్నిన మంతనంబు,
బేలనే యిట్టిమాయల బేలువోప?

ఇంతకాలము నుండి న న్నెఱిఁగి
ఎట్టి సాహసమున కొడిగట్టినావె ?
కాని, నీమాట యేటికి కా దనవలె?
బుడుత నా కిచ్చి, అవలికి వెడలు మీవు.”

24