పుట:మధుర గీతికలు.pdf/474

ఈ పుట ఆమోదించబడ్డది


చిన్ని బాలుని మనుమామచేత నిడిన,
తనదు తనయుని మరణంబు తలఁచి యతఁడు
బుడుతఁ గౌఁగిటఁ జేరిచి బుజ్జగించి
ప్రీతి నల్లారుముద్దుగఁ బెంచు సుమ్ము.”

అనుచు నొప్పించి బాలుని గొనుచు కుంద
వేగ తనమామపొలమున కేగి, యచట
గుజ్జుగా నున్న యెలమావిగున్న నీడ
నొదిఁగి కూర్చుండె బిడ్డని నొడిని జేర్చి.

ఆమెఁ బొడఁగనిముదుసలి యనియె, “బాల!
ఒంటిమై యేల వచ్చితి వింటినుండి?
ముద్దు లొలికెడి యా చిన్ని బుడుతఁడెవఁడు?”
అనుడు, గొదుకుచు నీరితి ననియె కుంద.

“ఎవడు నీయాన జవదాఁటి యే నెఱుంగ,
నేఁడు చేసినతప్పు మన్నింపు మయ్య,
అన్యుఁ డెవ్వఁడు కాడు-నియనుఁగుసుతుని
కన్నతనయుఁడు సుమ్మి యీచిన్ని బిడ్డ.”

23