పుట:మధుర గీతికలు.pdf/473

ఈ పుట ఆమోదించబడ్డది


కడచె కొన్నాళ్ళు, అంతట కఱవు వచ్చె;
ఏమి చెప్పుదు - నక్కటా! లేమిచేత
తాళఁజాలక నందుండు తనువు విడిచె
వాని మరణంబునకు కుంద వనట నొంది,

పున్నయింటికి నేతెంచి, కన్నుదోయి
బాష్పములు జాలువాఱంగ బాలు నెత్తి
అక్కునను జేర్చి విలపించు నామెఁ జూచి,
బాళి నాలింగనము చేసి పలికె నిట్లు.

"కుంద యందురు నను వినియుందు గాదె!
నిన్ను జేపట్టి నాకంబు చన్నవాని
నుల్ల మారఁగ ప్రేమించియున్న దాన-
తడవ నేటికి యిప్పు డాగొడవ యెల్ల?

నీదుసుతుమీఁద నీ కెంత యాదరంబు
కలదొ, అంతయు నాకును కలదు గాన,
వాని జూడంగ వచ్చితి, వాని హితము
మనకు నిరువుర కొక్కసమంబు గాదె?

22