పుట:మధుర గీతికలు.pdf/472

ఈ పుట ఆమోదించబడ్డది



కన్న కూఁతురు కన్నను కరము ప్రేమఁ
బెంచితిని నిన్ను, నను కస్తివెట్టినట్టి
వానితోడను మాటాడితేని, వినుము -
గెంటివై చెద నిను గూడ నింటినుండి.”

కుంద తలపోసె నీరీతి డెందమందు;
'తనయు పైనింత తెగిపడు తండ్రి గలఁడె?
కొన్ని దినముల కంతయు కుదురుపడక
యున్నె? అందాఁక సైరించి యుందుఁ గాక.’

పుణ్యదినమున నొకనాఁడు పున్న గనియె
నిండుచందురుఁ బోలిన నిసుఁగు నొకని;
తనకుటుంబము పోషించుకొనఁగ లేక
ఏగె నందుఁడు తనతండ్రి యింటి కడకు.

కటకటా! వృద్ధుఁ డెంతటి కటికవాఁడొ!
కొడుకు నవలికి గెంటించె కోప మడర;
అతనిదురవస్థ కెంతయు నాత్మఁ గుంది.
సాయపడే కుంద ధన మిచ్చి శ క్తికొలఁది.

21