పుట:మధుర గీతికలు.pdf/471

ఈ పుట ఆమోదించబడ్డది


సరియె కానిమ్ము - రెండుమాసముల లోన
దానిఁ జేపట్టితివ సరే. లేనియెడల,
నేను జీవించునందాఁక నింటిలోని
కడుగువెట్టంగ వలవదు గడప దాఁటి.

ఏమియును మాఱు పలుకక మోము వాల్చి
నేల జూచుచు నందుండు నిలిచియుండె!
తటుకు మని లేచి కినుకచేఁ గటము లదర
వడిగఁ జిందులు తొక్కుచు వెడలె తండ్రి.

గడువు దాఁటకమున్నె యాపడుచువాఁడు
తండ్రి యిలు వీడి యవలికి తలఁగిపోయి,
పొలముకాఁపరికూఁతును 'వున్న' యనెడు
పేదబాలిక నొక్కతెఁ టెండ్లి యయ్యె.

కొంతకాలము జనినంత, కుందఁ బిలిచి
ముదుకఁ డిట్లనె, “సుతుఁడు నాముదల మీఱి
యిల్లు వెడలెను, బాల! నీ వెట్టిలీల
మోద మొనగూర్తువో నాకు ముదిమియందు?

20