పుట:మధుర గీతికలు.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

36

ఈ ఉత్సవములు జరుపుటకు నిశ్చయించినప్పటి నుండియు, కార్యవర్గమున సభ్యత్వము నామోదించి, అన్ని విధములా మాకు చేదోడు వాదోడుగా నున్న మా కార్యవర్గము వారి కందఱకును మా కృతజ్ఞతాంజలి !

ముఖ్యముగా నాళము కృష్ణరావుగారి శతజయంతి సంరంభము ఆరంభింపబడినప్పటి నుండి, అనేక సభలు చేయించియు సభలలో పాల్గొని ప్రసంగించియు అనేక వ్యాసములు వ్రాసియు, అనేక సంస్థలలో శ్రీకృష్ణరావుగారి చిత్రపటములను ఉచితముగా బహూకరించియు, ప్రస్తుతము నాళం వారి సంక్షిప్త జీవితచరిత్ర వ్రాసియు స మధికోత్సాహముతో నాళము కృష్ణరావుగారి శతజయంత్యుత్సవములో పాల్గొనుచున్న శ్రీ చిట్టిప్రోలు సుబ్బారావుగారు, ఎం. ఏ., తెలుగు లెక్చరరు, S. S. & N. కాలేజి, నరసరావుపేట వారికి మా కృతజ్ఞతాంజలి.

కారెంపూడి మున్నగు స్థలములలో శతజయంతులు జరిపించిన కవిశేఖరులు శ్రీ చిట్టిప్రోలు కృష్ణమూర్తిగారికి, మా ధన్యవాదములు.

ఈ శతజయంతి సందర్భముగా ప్రచురణ మందిన ఈ “మధురగీతికలు” సంపుటిపై వచ్చు ఆదాయమును ఒక రిజిష్టర్డు ట్రస్టు నేర్పఱచి దాని పై వచ్చు ఆదాయపు వడ్డీతో సాధ్యమైనంత వఱకు ప్రతి సంవత్సరము శ్రీ నాళము కృష్ణరావుగారి స్మారక సభలు, స్కాలర్ షిప్‌లు మున్నగు కార్యక్రమములను నిర్వహించుటకు నిశ్చయించడమైనదని తెల్పుటకు సంతసించు చున్నాము

శతజయంతి సమ్మాన సంఘము