పుట:మధుర గీతికలు.pdf/468

ఈ పుట ఆమోదించబడ్డది

కుంద


కాంచిపురమునఁ గలఁ డొక్క కాఁపువాఁడు-
అతని నామము గోవిందుఁ డనఁగఁ బరఁగు;
నందుఁ డాతని గారాబు నందనుండు,
కుంద యాతని చెల్లెలి కూర్మితనయ.

ఈడుజోడుగఁ గూడి వా రాడుచుండ
మోదమునఁ జూచి ముదుకండు మురియుచుండు,
'బళిర! వీ రిర్వు రొకటియై మెలఁగి రేని,
నాదు కోరిక ఫలియించుఁ గాదె' యనుచు

కుంద యాతనిభావంబు గుర్తెఱింగి
నందుఁడే తన హృదయాధినాధుఁ డనుచు
నమ్మె; నక్కట దైవమ్ము వమ్ము చేసె
నామె నిర్వ్యాజ నిర్మలప్రేమ మెల్ల.

17