పుట:మధుర గీతికలు.pdf/464

ఈ పుట ఆమోదించబడ్డది


అనుడు, నబ్బుర మందుచు ననియె గిరిజ:
'ఎట్టెటూ! నామనోహర! ఏమి యంటి?
వీతఁడా నాదు మఱఁదలి యెమ్మెకాఁడు!
విందు చెప్పుమ వీనులవిందు గాఁగ’

అనుచు మోమున దరహాస మంకురింప
గిరిజ, తనచెంత సిగ్గుచే శిరము వంచి
తలుపుచాటున నోరఁగా నిలిచియున్న
యిందుకళఁ జూచి యామెతో నిట్టు లనియె. '

'ఓసి వగలాడి! నీసిగ్గు మాసిపోను -
నంగనాచివై యేమి యెఱుంగనట్టు
లింటఁ గూర్చుండి తగిలించుకొంటి వౌర!
కొమిరెపాయపు చక్కని కోడెకాని.

ఏమె నా ముద్దుమఱఁదలా! ఇట్టు రావె!
ఓసరిల్లిన నామీఁదియొట్టు సుమ్ము-
బెట్టుసరి చేసి పిరువీకు వెట్టితేని,
పెనఁచి పట్టింతుఁ జువ్వె నీ ప్రియునిచేత, '

13