పుట:మధుర గీతికలు.pdf/463

ఈ పుట ఆమోదించబడ్డది


'చూచితే నాధ! ఎంతటి చోద్య మొక్కొ!
వేగుజామున నెవ్వఁడో యోగివరుఁడు
మన గృహంబున కరుదెంచి, ధన మొసంగి
నన్ను రక్షించినట్లు స్వప్నంబు గంటి.'

ఆ సుధామధురోక్తుల నాలకించి
నింగి ముట్టిన భంగి నుప్పొంగి యతఁడు
హిమకరుని బిల్చి యాపె కట్టెదుట నిలిపి,
పలికె నీరీతి చిఱునవ్వు మొలక లెత్త.

'నీదుకలలోఁ బ్రసన్న మై, నిన్ను నన్ను
నుద్ధరించిన యట్టి యాయోగి యడుగొ,
నీ యనుంగుమఱందలి చేయిపట్ట
నిన్ను నర్థింపఁగా వచ్చియున్న వాఁడు.'

కలిమి గలవాఁడు, చెలువంబు గులుకువాఁడు,
హొయలు గలవాఁడు, మవ్వంపు వయసువాఁడు,
ఇవ్వి యన్నియు నటు లుండ. ఇందుకళకు
చిఱుతపాయమునాఁటి నెచ్చెలిమికాఁడు. '

12