పుట:మధుర గీతికలు.pdf/462

ఈ పుట ఆమోదించబడ్డది


ఆతని లోనికిఁ దోడ్కొని యాదరించి
వలయు నుపచారముల నెల్ల సలుపుచుండు,
మింతలో నేను వైద్యునియింటి కేగి
వేగ వచ్చెద నాతని వెంటఁ గొనుచు.'

తోడనె యతండు వైద్యుని తోడికొనుచు
గృహమునకు వచ్చె; వైద్యుండు గిరిజఁ జూచి
తల్లడిల్లి యు-ధైర్యంబు దాల్చి, యామె
కుతుకలో వైచి మ్రింగించె ఘుటిక యొకటి.

భానుఁ డుదయించె దేదీప్యమానుఁ డగుచు,
దెసలు తొలివొందె, గిరిజయు తెలివి గాంచె;
ఇనకరంబుల విరిసిన హిమము వోలె,
మందుచే నామె రోగంబు డిందువడియె.

కొంతవడి కామె యించుక కుదుట నొంది,
కాలుసేతులు నల్లార్చి, మేలు కాంచి,
కన్ను దమ్ముల నరవిచ్చి కాంతుఁ జూచి
పలికె నీరీతి సన్నని యెలుఁగు తోడ.

11