పుట:మధుర గీతికలు.pdf/461

ఈ పుట ఆమోదించబడ్డది


అనుడు, నామాట వినినంత తనదువెతలు
చివుకు మని యొక్క పెట్టున స్మృతికి రాఁగ
నాకముననుండి తోడనే నరకమునకు
తూలిపడినట్లు దేవదత్తుండు తలఁచి.

'అక్కటా! ఏమి చెప్పుదు ననుఁగుసఖుఁడ!
నాదు దురవస్థ? పెక్కుదినాల నుండి
ప్రబలతర మగు వ్యాధిచే బాధపడుచు
మరణవేదన పడుచుండె గిరిజదేవి.

నీవు నాపాలి సౌభాగ్యదేవత వయి
వచ్చి యామెప్రాణంబు గాపాడినావు;
నీవు రాకున్న నాగతి యేమి యగునొ
లేబరము గాదె వి త్తంబు లేని బ్రతుకు! '

అనుచు నీరీతి వచియించి, యతఁడు లోని
కేగి, యిందుకళను లేపి యిట్టు లనియె;
'చెలియలా! నీదు చిననాఁటి చెలిమికాఁడు
హిమకరుం డిదె మనయింటి కేగుదెంచె.

10