పుట:మధుర గీతికలు.pdf/460

ఈ పుట ఆమోదించబడ్డది


నాదు జనకుండు మున్న నీ నాయనకడ
ఆఱులక్షల రూప్యంబు లప్పు గొనియె;
నిన్న రాతిరి యాతండు నన్ను బంప,
వడ్డితో దాని దీర్పంగ వచ్చినాఁడ.

నాఁడు మీజనకుఁడు మా కొనర్చినట్టి
సాయమునఁ గాదె, మా కిప్డు సంభవించె
భూరిసంపద, కీర్తియు, గౌరవంబు
వేయు నేటికి - నేఁటి యీ విభవ మెల్ల.

అనుచు నతఁడు మాటాడుచున్నంత సేపు,
దేవదత్తుఁడు తన్నట్టె తేఱి చూచి
ఊరకుండుటయే కాని, మాఱువలుక
కుంటఁ గనుగొని, యచ్బెరు వొంది యతఁడు.

'ఏమి మిత్రమ! నేఁడు నీమోము జూడ
విన్ననై యున్న దేటికి చెన్ను దొరఁగి
తేఱి యటు లేల చూచెదు తెల్లఁబోయి
సేమమే కద భార్యకు చెలియలికిని?

9