పుట:మధుర గీతికలు.pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఆంధ్రదేశమునందలి వదాన్య శేఖరుల సహాయముతో శతజయంతి ప్రచురణములుగా ముద్రణ చేయించినారు.

బహుకష్టసాధ్యమైన ఈ మహా కార్యమును ఆమె ఒక్కరే నిర్వహించి, మా సంఘము వారి శ్రమను తొంబదితొమ్మిది పాళ్ళు తగ్గించినందులకు సోదరి లక్ష్మీకాన్తమ్మగారికి ధన్యవాదములు - ఈ శతజయంతి ప్రచురణకు ఆర్థికముగా సాయమొనర్చిన దాతలకు మా కృతజ్ఞతా వందనములు - ఆ వివరములు వేరే యియ్యబడినవి.

మధురకవి శతజయంతి జరుగవలెనను సంకల్పము ఆంధ్ర మహా జనులలో కల్గుటయే తడువుగ 1881 జనవరి 16 వ తేదీనాడు బాపట్ల యందు కళాభారతి వారును, రాజమహేంద్రవరము నందు గౌతమీ గ్రంథాలయము వారును ఉత్సాహముగా జరిపిరి.

తరువాత 1981 జనవరి 21 వ తేదీనాడు శతజయంతి సంఘమువారు వైభవముగా జరిపి‌ 'ఈ సంవత్సరము శతజయంతి వత్సరము' గా ప్రకటించిరి.

తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవ్వైశ్య సంఘము వారు హైదరాబాదు నందు జరిపిరి.

తరువాత, తరువాత నరసరావు పేట యందును, కారెంపూడి యందునుబాపట్ల ఆర్యవైశ్య సంఘము వారును వేటపాలెం సారస్వత నికేతనము వారును, వినుకొండ యందును 1983 జనవరి నాడు రాజమహేంద్రవరమునందు టౌనుహాలి కమిటీ