పుట:మధుర గీతికలు.pdf/455

ఈ పుట ఆమోదించబడ్డది


కోట్ల కొలదిగ రూప్యముల్ నోట్లు వ్రాసి
ము న్నతనితండ్రి కడ బదుల్ గొన్నవార
లుండి రెందరొ, వారిలో నొక్కడైన
సాయపడఁడయ్యె ధనమిచ్చి సమయమునకు.

ఆపురంబునఁ గలఁ డొక్క కాఁపువాఁడు
చండిదా సను పేరి భిషగ్వరుండు;
వైద్యమున వాని కెంతటి ప్రజ్ఞ గలదొ,
ధనము గుంజుటయం దంత ఘనత గలదు.

ఉసు రొకించుక కుత్తుక నుండె నేని,
ఎట్టి రోగము నిట్టె పోఁగొట్టఁ గలఁడు;
వాఁడు శవమును బ్రతికింప లేఁడు కాని,
పెనగిఁ శవమున విత్తంబు పిండఁగలఁడు.

ముందు ధన మిచ్చినను గాని మం దొసంగ
ననియె నావై ద్యుఁ డెంత వేఁడినను గాని,
కనికరం బింత యతనికి కలుగదయ్యె;
నిర్ధనుని జీవితం బిల వ్యర్థము గద.

4