పుట:మధుర గీతికలు.pdf/445

ఈ పుట ఆమోదించబడ్డది


జలములను మున్గినంతనె కలదె ముక్తి ?
ఆత్మతీర్థమె ముక్తిద మగును గాక :
తీర్థజలముల మునుఁగుచుఁ దేలియాడు
మొసలి మీనుల కబ్బునే మోక్షపదవి ?

బ్రాహ్మణ బ్రాహ్మణేతర భావములను
పెనచి కలహింతు రేటి కో చెనటులార ?
బ్రాహ్మణుఁ డొకండె మోక్షసామ్రాజ్య మెల్ల
నూగులాడునె కలకాల ముట్టిగట్టి ?

కులవిభేదన నిగళంబు కూలఁద్రోయ
లేనివాఁడు స్వరాజ్యంబు బూనలేఁడు;
ఉట్టి కెగురంగఁ జాలని యట్టివాఁడు
స్వర్గ మెగురంగఁ దలఁచుట భ్రాంతి కాదె?

మతము మత మంచు మాటికి మచ్చరించి
కాలు ద్రవ్వెద రేటికి కయ్యమునకు?
మతికి సమ్మత మైనదే మతము సుమ్ము,
సర్వమతములయందలి సార మిదియ.

72