పుట:మధుర గీతికలు.pdf/442

ఈ పుట ఆమోదించబడ్డది

కులము



కులము కుల మంచు నేటికి కలవరింత?
జన్మమాత్రముచేతనే జాతి యగునె?
గుణము గలిగిన కులము సత్కులము గాని,
గుణము లేకున్న కులము దుష్కులము గాదె?

జననికడుపున జను లెల్ల జనన మొంద,
బ్రహ్మముఖముననుండియు, బాహువులను,
ఊరువులనుండి, పదముల నుద్భవిల్లి
రనుట యెట్టివివేకమో అరయుఁ డయ్య.

బ్రహ్మతత్వము తెలిసిన బ్రాహ్మణుఁ డగు,
క్షాత్రమునఁ దేజరిల్లిన క్షత్రియుఁ డగు,
వర్తకంబును కృషి చేయ వైశ్యుఁ డగును
క్షుద్రసేవ యొనర్చిన శూద్రుఁ డగుసు.

69