పుట:మధుర గీతికలు.pdf/441

ఈ పుట ఆమోదించబడ్డది




వర మహాత్ముఁడు మి మ్మెల్ల దరిని జేర్ప
తనదు జీవిత మెల్లను ధారవోసి
సకలకులజులలో నీకు సమత గూర్చి
'హరిజనుం' డను బిరు దిచ్చి యాదరించె,

వెన్నునకు నీవు కడగొట్టు బిడ్డ వగుట,
అతఁడు ధరియించు 'మాల 'గా సతము నిన్ను;
హరికిఁ గూర్చినవాఁడవై యలరు నీకు
అర్హ మగుఁ గాదె 'హరిజనుఁ' డనెడు బిరుదు!

లెమ్ము! హరిజనసోదరా! తమ్ము! నీదు
పున్నెములు పండె తొలఁగె నీ బన్నములిఁక,
నిండుకౌఁగిట నిను జేర్చి నిఖిలజనులు
ఆదరింతురు తమ కూర్మి సోదరునిగ

68