పుట:మధుర గీతికలు.pdf/44

ఈ పుట ఆమోదించబడ్డది

33

కళా సాంస్కృతిక పీఠముగ సముజ్వలమైన సహస్ర వర్ష చరిత్ర కల రాణ్ణగరియందు బాధ్యతకల పౌరుడుగా, ప్రభు మర్యాద నెఱపిన నాళము కామరాజుగారి కుమారుడైన తండ్రిగారి ధార్మిక, సాంస్కృతిక సంస్కారములకు వారసుడుగా, తన జమీందారీ సంపదనంతను దేశము కొఱకు, సాహితీ సరస్వతీ సమారాధన కొఱకు, ముఖ్యముగ గౌతమీ గ్రంథాలయ నిర్వహణ కొఱకు అంతస్తునకు మించునట్లు వ్యయించి రిక్తుడై మిగిలిపోయిన నిస్స్వార్దత్యాగశీలి. సంఘరూపమైన మాధవ సేవయందే, మానవ జీవితమును ధన్య మొనర్చుకోవలెనను ఉత్తమాశయ దీక్షతో బ్రతుకు కప్పురహారతి గావించుకొని, బాల్యమున సాధనచేసిన, రామభజనకు, ఏకేశ్వరోపాసనయందు సాఫల్యసిద్ధిని గావించుకొని ధన్యజీవిగా, జీవించి, మరొకమాఱు మాన్యమైన, ఆ మహానగర లక్ష్మీయొక్క చిద్విలాస హాస రేఖలను యావదాంధ్రమును శుభ్ర ధవళ రోచిస్సులలో కాంతిలహరులుగా నర్తన మొనరింపజేసిన, సద్గుణాఢ్యుడు, సంస్కారి, శీలవంతుడు, సంఘ శుభచింతకుడు, ఈశ్వరవిశ్వాసి, మహాకవి, బాలుర భవితవ్యమునకు ధర్మ దీప్తితో పధములు పఱచిన మధురకవి నాళము కృష్ణరాయ శత జయంతిని మా సమ్మాన సంఘము వారు జేగీయ మానముగా నిర్వహింప దొఱకొనుట యెంతేని భాగ్యకారణముగా భావించు చున్నాము.


ఈ శతజయంతికి ముఖ్య ప్రేరణ నొసంగి ఈ సందర్భ ముగా వారి కావ్యములన్నింటిని వారి కుమార్తెయైన కళా ప్రపూర్ణ, ఆంధ్ర సరస్వతి, సాహితీ రుద్రమ, ధర్మ ప్రచారభారతి,