పుట:మధుర గీతికలు.pdf/439

ఈ పుట ఆమోదించబడ్డది



పొలములను దున్ని, లెస్సగా కలుపు దీసి
ఎల్లజనులకు కూడు నీ విడుచునుండ,
తినఁగ తిండియు లేకుండ జనులు నిన్ను
కస్తి పెట్టుచునున్నారు పస్తు పెట్టి,

బహుదినంబులు శ్రమపడి బావి త్రవ్వి,
ఎల్లరికి నీవు జలముల నిచ్చుచుండ,
కుత్తు కెండిన, నక్కటా: గ్రుక్కె డైన
నీరు గ్రోలంగనీయరు నిన్ను జనులు.

హేయ మగు మలమూత్రంబు లెత్తి వైచి
తనదు శిశువులఁ బోషించు తల్లిరీతి,
మలిన మెల్లను తొలఁగించి మానవులకు
కూర్చుచుందుపు సౌఖ్యంబు కూర్మి మీఱ .

పాలకడలిని బొడమిన హాలహలము
దారుణోజ్వలకీలల ధరణితలము
దగ్ద మొనరించుచుండఁగ, దాని మ్రింగి
ఉద్దరింపఁడె యీశ్వరుఁడుర్వి నెల్ల?

66