పుట:మధుర గీతికలు.pdf/434

ఈ పుట ఆమోదించబడ్డది

ఆజ్ఞ యొసఁగుము



ఆజ్ఞ యొసఁగుము, జీవింపు మంచు నన్ను,
తరుణి! జీవింతు నీ పాదదాసుఁడనయి;
ముదలవెట్టుము, నా ప్రేమ మొసఁగు మంచు,
హృదయపూర్వకమైన నా ప్రేమ మిత్తు.

ఆనతి యొసంగు, మెన్నియేండ్లైన నన్ను
వేచియుండు మటంచు నో వెలదిమిన్న !
నీ యనుజ్ఞను తలదాల్చి నిలిచియుందు
నాదు తనువున జీవ మున్నంతదాక.

అనుమతింపుము, విలపింపు మనుచు నన్ను,
కనుల నశ్రులు కాల్వలు గట్ట నేడ్తు;
ఆన సేయుము, నీపయి నాస వీడు
మనుచు, తోడనే వీడెద నాస నేను.

61