పుట:మధుర గీతికలు.pdf/433

ఈ పుట ఆమోదించబడ్డది

జీవమా!




ఎవరవో నీవు జీవమా : ఏ నెఱుంగ
నీవు నేనును బాయుట నిక్క మంచు
ఎఱుఁగుదును, కాని మన మెప్పు డెచట నెట్లు
కలసికొందుమొ క్రమ్మర తెలియఁజాల.

ఇంతకాలమునుండియు నీవు నేను
కలసియుంటిమి కష్టసుఖంబులందు;
అకట: చిరకాల మిత్రుల మైన మనము
బాసియుండుట కరము దుర్భరము కాదె?

జీవమా ! నేను నీ కిదే చెప్పుచుంటి:
ఎప్పు డైనను సరియె-నీ యిచ్చవచ్చి
నప్పు, డించుక నాతోడ చెప్పకుండ
చల్లఁగా మెల్లఁగా నీవు జారిపొమ్ము.

60