పుట:మధుర గీతికలు.pdf/432

ఈ పుట ఆమోదించబడ్డది




అంత నాతఁడు ధోరణి యట్టె మార్చి
కన్ను పక్షము వాదించెఁ, గాని వాని
మాట లొక్కింత సూటియు పాటి లేక
సారహీనములై తోఁచె సభ్యతతికి,

సరస గంభీర ధారాళ శైలితోడ
ధాటిమై తీర్పు చెప్పె నా ధర్మక ర్తః
'నేఁడు మొదలుగ నద్ధాలజోడు ముక్కు
పూన్చినపు డెల్ల కన్నులు మూయవలయు.'

59